నరసాపురంలో 216 జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి అక్రమంగా ఆవులను తరలిస్తున్న మినీ లారీని వీహెచ్పీ, భజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు. పాలకొల్ల నుంచి వస్తున్నాయనే సమాచారం ఆధారంగా పట్టణంలో ముట్టడి చేసి 22 ఆవులతో ఉన్న లారీని అడ్డగించారు. డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు.