నరసాపురం: చెరువులో పడి వృద్ధుడి మృతి

నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన 75 ఏళ్ల దివ్యాంగుడు పెచ్చేట్టి సుబ్బారావు బుధవారం ముఖం కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గురువారం సుబ్బారావు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన లిఖితపూడి గ్రామంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్