శనివారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ను కొప్పర్రు, రుస్తుంబాద, మంగళగుంటపాలెం ప్రాంత రైతులు కలిసి తమ సమస్యలను వివరించారు. పంట బోధులు పూడికతో నిండిపోవడం, గుర్రపు డెక్కలు అధికంగా ఉండడం వల్ల నీరు పంట పొలాలకు చేరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ డ్రైనేజీ నీరు పంట బోధుల్లోకి కలవడం, ఆక్రమణలు, చెట్లు కాలువల్లో పడిపోవడం వలన నీటి ప్రవాహం తగ్గిపోవడంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు వాపోయారు.