నరసాపురం మండలం వేములదీవిలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలు, అనుమతులు లేకుండా చెరువులు, పంట పొలాల నుంచి మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. కళ్లెదుటే అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.