మైక్రో ఆర్టిస్ట్ విజయ్ మోహన్ ను సన్మానించిన నరసాపురం ఎమ్మెల్యే

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తన కార్యాలయంలో మైక్రో ఆర్టిస్ట్ కొప్పినీడి విజయ్ మోహన్ ను సన్మానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం అందుకున్నందుకు విజయ్ మోహన్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభావంతులకు తమ ప్రభుత్వంలో ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని, విజయ్ మోహన్ కు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్