భక్తులతో కిటకిటలాడిన నరసాపురం వశిష్ఠ గోదావరి తీరం

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం, రథోత్సవ వేడుకల సందర్భంగా నరసాపురం వశిష్ఠ గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న యాత్రికులు నరసాపురం ఫెర్రీ(రేవు) ద్వారా పడవల్లో అంతర్వేదికి చేరుకుంటున్నారు. గోదావరి అందాలను వీక్షిస్తూ, ఆధ్యాత్మిక ఉత్సాహంతో భక్తులు సాగిపోతుండటంతో నరసాపురం రేవు వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్