నరసాపురం జైన్ టెంపుల్ సమీపంలో తణుకుకు చెందిన గణేశ్ (40) అనే బేకరీ కార్మికుడు అద్దె గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి దుర్వాసన రావడంతో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితమే అతను మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.