నరసాపురం పట్టణంలోని వశిష్ఠ గోదావరి తీరం లలిత ఘాట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో, రెండు, మూడు రోజుల క్రితమే నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.