సరిగ్గా 16 ఏళ్ల క్రితం బియ్యపుతిప్ప వద్ద జరిగిన పడవ ప్రమాదం గోదావరి జిల్లాలను నేటికీ వెంటాడుతోంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్లిన పడవ బోల్తాపడి 11 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలే. నరసాపురం కోర్టు 110 మంది సాక్షులను విచారించి, 2018లో పడవ డ్రైవర్‌కు 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది. కాలం గడిచినా, ఆనాటి విషాదం ఇంకా పచ్చిగానే ఉంది.