పెనుగొండ మండల వడలి శివారులోని ఇటుకల బట్టి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచంట వేమవరం గ్రామానికి చెందిన మైలే రాజారావు (55) తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బొలెరో, ట్రాక్టర్ మధ్య ఇరుక్కుపోవడంతో ఆయన ఎడమ కాలు, చెయ్యి నుజ్జునుజ్జు అయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.