పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నేతపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. తాను జనసేన అభిమానినని, అయితే ఆ నేత తనను ఆర్థికంగా, శారీరకంగా ఉపయోగించుకుని ప్రస్తుతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో, కొన్ని ఆడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.