భారీ వర్షాలతో పేరుపాలెం జలమయం, రైతుల ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం ప్రాంతాల్లో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో పంట పొలాలు, చెరువులు, గుంటలు నిండిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వరిసాగు, కొబ్బరి తోటలు, కూరగాయల పంటలు నీటిలో మునిగిపోయాయి. చాలా చోట్ల వీధులు, రహదారులు కూడా నీటితో నిండిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్