పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నరసాపురం నెక్లెస్ రోడ్ నుండి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ వరకు అభిమానులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రభాస్ జన్మదిన వేడుకలను ముందస్తుగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు, మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.