నరసాపురంలోని స్థానిక పంజాసెంటర్ లో మంగళవారం రంజాన్ మాసం సందర్భంగా ఎండీ మన్సూర్ ఖాన్ కుమారులు 'రంజాన్ తోఫా' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.