పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు, చిన్నారులు ఆలపించిన గీతాలను ఆస్వాదించారు. యేసు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని దైవజనులకు ఆయన సూచించారు.