డిప్యూటీ తహశీల్దార్‌గా శేరు తాతయ్య ఎంపిక: అభినందనలు

మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామానికి చెందిన శేరు తాతయ్య గ్రూప్-2 పరీక్షల్లో డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం పి వి రావు మాలమహానాడు మండల నాయకులు ఆయనను అభినందించారు. ఉద్యోగం సాధించిన తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చిన తాతయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ స్పూర్తితో ఉద్యోగం సాధించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్