వరాల వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పాత బజార్ (పొట్టి శ్రీరాములు నగర్) లోని శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు అభిషేకాలు, పూజలు చేశారు. అలంకరణ అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్