జిల్లాలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు

ఈ నెల 15న మొగల్తూరులో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సును నిర్వహిస్తున్నట్లు అప్కాబ్ మాజీ ఛైర్మన్ చల్లా రావు వెల్లడించారు. శుక్రవారం లక్ష్మణేశ్వరంలో ఆక్వా రైతులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లారావు మాట్లాడుతూ, సమస్యలన్నింటిపై చర్చించేందుకు, ఆక్వా రంగాన్ని కాపాడుకునేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తారు.

సంబంధిత పోస్ట్