మొగల్తూరులో వీధి కుక్కల స్వైరవిహారం, ప్రజల్లో భయాందోళనలు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో వీధి కుక్కలు రహదారిపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కుక్కలు తిరుగుతుండటంతో వాహన చోదకులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎప్పుడు దాడి చేస్తాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్