గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాధవాయిపాలెం సమీపంలోని గోదావరి నదిలో బుధవారం సుమారు 30 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీఆర్వో కొప్పినీడి వెంకట సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్