బహ్రయిన్ లో ఉపాధి కోసం వెళ్లి మృతి చెందిన నర్సాపురం కు చెందిన వర్ధనపు కవిత (24) మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని ఆమె కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మను కోరారు. ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, నర్సాపురం వచ్చిన మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని కేంద్రమంత్రి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.