పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద రాజు, తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని అన్నారు. శనివారం నరసాపురంలోని శ్రీ రాజగోపాల్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై విష ప్రచారం ఇకనైనా ఆపాలని కోరారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు కోట్లాది మంది ఆరాధ్యంగా భావించే వెంకటేశ్వరస్వామి ప్రసాదం గురించి నోటికొచ్చినట్లు విమర్శలు చేశారని ఆయన విమర్శించారు.