ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్ లో సముద్ర స్నానం చేస్తూ ఏలూరు కొత్తపేటకు చెందిన మునగాల మోహన సాయి గణేష్ (18) అనే యువకుడు అలల ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి బీచ్ కి వచ్చిన ఇతను, విజయవాడలోని ఉషారామం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎస్సై జి వాసు, మెరైన్ ఎస్ఐ పి సోమశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.