చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నాయకుల

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. గురువారం మండల కేంద్రమైన మొగల్తూరులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ గత రెండేళ్లు పాలన చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేకుండా తన సొంత లాభం చూసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్