సూరంపాలెం ఆంజనేయ స్వామి ఆలయంలో 108 చాలీసా పారాయణం, అన్నదానం

ఏలూరు, నూజివీడు ప్రాంతంలోని సూరంపాలెం పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో చనుబండ పిఎసిఎస్ చైర్ పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో 108 సార్లు చాలీసా పారాయణం చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం చాట్రాయి మండలం సూరం పాలెం గ్రామంలో చనుబండ మాజీ సర్పంచ్ మోరంపూడి అనసూయ వెంకటేశ్వరరావు, చనుబండ పిఎసిఎస్ చైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్