నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాలలో 1989-92 మధ్య బీఎస్సీ ఎంపీసీ గ్రూపులో చదివిన విద్యార్థులు 34 సంవత్సరాల తర్వాత నూజివీడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సోమవారం కలుసుకున్నారు. ఈ అపూర్వ కలయికలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కళాశాల తర్వాత వివిధ రంగాల్లో స్థిరపడిన తమ అనుభవాలను పంచుకొని భావోద్వేగానికి గురయ్యారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమ్మేళనాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.