ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే యువతి ఆత్మహత్య

చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న మోహన చంద్రలేఖ(22) అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో డిగ్రీ చదువుతున్న ఆమె, ఆ జిల్లాకు చెందిన ఆరెళ్ల లితిన్‌ను ప్రేమించి గత నెల 23న వివాహం చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే కట్నం తీసుకురాలేదని అత్త, బంధువులు వేధించడం ప్రారంభించారు. భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె, ఆదివారం రాత్రి పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకు తన బాధను చెప్పుకుంది. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్