ఆగిరిపల్లి: ఉపాధ్యాయుల కొరతపై మంత్రి ఆదేశం

ఆగిరిపల్లి మండలం సీతారాంపురంలో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను హెచ్ఎం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్