వైసీపీ కార్య‌క‌ర్త‌పై హ‌త్యాయ‌త్నం

ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ శోభనాపురం గ్రామంలో వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్కనుపోయిన సాంబశివరావుపై టీడీపీ మండల అధ్యక్షుడు వేణు హత్యా యత్నానికి పాల్పడ్డారు. సాంబశివరావు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతోనే ఈ దాడి జరిగినట్లు బాధితుడు ఆరోపణలు చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్