చాట్రాయి మండలం నరసింహారావుపాలెంలో శనివారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు భరోసా కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 19 మంది లబ్ధిదారులకు 7 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.