ముసునూరు మండలం రమణక్కపేటలో స్తంభానికి కట్టేసి దాడి చేసిన కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు DSP ప్రసాద్ తెలిపారు. సాయిదుర్గ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక, గతనెల 31న ఆమె తల్లిదండ్రులు కందుల బాబు, విజయలక్ష్మి మరో నలుగురితో కలిసి దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.