నూజివీడు బొందిలిపేటలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు హుండీని దొంగిలించారు. స్థానిక భక్తుల కథనం ప్రకారం, ఆలయంలోని ఇనుప గ్రిల్స్‌కు అమర్చిన పోస్ట్ బాక్స్ సైజులో ఉన్న హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇందులో సుమారు రూ.20 వేల నగదు ఉన్నట్లు అంచనా. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు.