ముసునూరు: వేధింపులతో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

ముసునూరు మండలం బలివే శివారు రంగంపేటకు చెందిన కౌలు రైతు దాసరి సత్యనారాయణ (40) శుక్రవారం కలుపు మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. సరిహద్దు రైతు నిత్య వేధింపులే కారణమని అతను పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్