నూజివీడు: ఈనెల 6న బహిరంగ వేలం పాట

నూజివీడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వినియోగంలో లేని భారీ వృక్షాల బహిరంగ వేలం పాటను నవంబర్ 6న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చెన్న రాఘవేంద్రనాథ్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం ఈ వృక్షాల విలువను రూ. 1.61 లక్షలుగా నిర్ణయించింది. వేలంలో పాల్గొనేవారు రూ. 20 వేలు డిపాజిట్ చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్