మంగళవారం రాత్రి కారకంపాడు గ్రామంలో నూజివీడు ప్రాంత ప్రజల సమస్యలను మంత్రి కొలుసు పార్థసారథి అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను వివరణాత్మకంగా పరిశీలించి, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, ఆలస్యం జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.