నూజివీడు: ఆరు నెలలుగా యువకుడి అదృశ్యం

నూజివీడు మండలం కొత్తూరు తండాకు చెందిన బాణావతు శ్రీకాంత్ (27) గత ఆరు నెలలుగా కనిపించడం లేదని ఆయన తల్లి కుమారి గురువారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూజివీడు పట్టణంలోని కొండయ్య సత్రం కాంప్లెక్స్లో శ్రీకాంత్ వెల్డింగ్ షాపు నడిపేవాడని ఆమె తెలిపింది. ఆయన ఆచూకీ తెలిస్తే స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత పోస్ట్