నూజివీడు: చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి

నూజివీడు మండలం సుంకొల్లు గ్రామానికి చెందిన సందీప్ (26) మామిడి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు పడిపోయి, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గత నెల 20వ తేదీన మామిడి కోతకు వెళ్లిన సందీప్ చెట్టుపై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశాడు. మృతుడి భార్య 6 నెలల గర్భవతి కావడంతో ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్