ఆగిరిపల్లిలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్‌

ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం మండలంలోని రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. నూజివీడు రూరల్ సీఐ ఐవి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, పాత కక్షలు, తగాదాలకు పాల్పడితే కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నిరంతరం పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్