తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశ రాజకీయ చరిత్రలో మరువలేని రోజు అని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం చను బండ సెంటర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజున, ఫ్యూడల్ ప్రభువులు రాజ్యమేలుతున్న రోజున రైతులు, కూలీలు, కార్మికుల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన చరిత్రను ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. ఈ సభకు గ్రామ టిడిపి అధ్యక్షులు మహేశ్వరరావు అధ్యక్షత వహించారు.