పాలకొల్లుకు చెందిన కొందరు యువకులు శుక్రవారం నరసాపురం వశిష్ఠ గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. చిన్న గాలంతో వేట సాగుతుండగా సుమారు 15 కిలోల బరువు ఉన్న భారీ ‘పాలుపు చేప’ చిక్కింది. ఇది జల్ల జాతికి చెందినదని వారు తెలిపారు. మార్కెట్లో ఈ చేపను కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వచ్చారు.