గుంటూరు GGHలో ప.గో. జిల్లా వాసి ఆత్మహత్య..!

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ శ్రీనివాస్ (50) గుంటూరు జీజీహెచ్‌ భవనం పైనుంచి దూకి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈనెల 23న చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. కాలకృత్యాలకని వెళ్లి వార్డు కిటికీలోంచి కిందకు దూకేశారు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్