కువైట్‌లో యలమంచలి వాసి మృతి

యలమంచిలి మండలం ఆర్యపేటకు చెందిన లక్ష్మి కుమారి (44) అనే మహిళ కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె గత 4 ఏళ్లుగా కువైట్‌లోని ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇండియన్ ఎంబసి సహకారంతో మృతదేహం శుక్రవారం ఇండియా చేరుకొనుంది.

సంబంధిత పోస్ట్