పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పోడూరులో మంగళవారం రక్తదాన శిబిరం జరిగింది. మండల తహసీల్దార్ మౌలానా ఫాజిల్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఇన్చార్జ్ MPDO నాగిరెడ్డి రక్తదానంపై ఉన్న అపోహలను వీడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MEOలు విజయకుమార్, సూర్యనారాయణ, టీచర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీకి రూ. 50 వేల విరాళం సేకరించి అందజేశారు. 21 మంది ఉపాధ్యాయులు రక్తదానం చేసి, దాతలకు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.