రైల్వే స్టేషన్ గోడను ఢీకొన్న కారు, నలుగురికి స్వల్ప గాయాలు

బుధవారం పాలకోడేరు మండలం శృంగవృక్షం రైల్వే స్టేషన్ వద్ద కారు అదుపుతప్పి స్టేషన్ గోడను బలంగా ఢీకొట్టింది. పాలకొల్లు నుంచి భీమవరం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్