రైల్వేస్టేషన్‌లో కుక్కల బెడద

పాలకొల్లు రైల్వేస్టేషన్‌లో కుక్కల బెడద ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్లాట్‌ఫామ్‌లపై గుంపులుగా తిరుగుతూ, ఆహారం కోసం ప్రయాణికులపై దాడులు చేస్తున్నాయి. స్టేషన్ ప్రాంగణంలో దుర్వాసనతో పాటు, వేలాది మంది ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యపై రైల్వే అధికారులు తక్షణమే స్పందించి, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్