ఎలమంచిలి: అదుపుతప్పి వాహనం బోల్తా.. వ్యక్తి మృతి

యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన 15 మంది ఆదివారం గండి పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అల్లూరి జిల్లా అంగులూరు ఘాట్ రోడ్డులో వారి వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నరసింహారావు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై కొద్దిసేపటికే మృతి చెందాడు. గాయపడిన మిగతా వారిని పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్