యలమంచిలి మండలం ఊటాడకు చెందిన శ్రీను (50) కూలీ పనులు చేసుకుని కాలం గడుపుతున్నాడు. అయితే కొంతకాలం నుంచి అనారోగ్యం, అప్పులబాధతో ఇబ్బంది పడుతున్న శ్రీను జూన్ 29న పురుగుల మందు తాగారు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. దీనిపై అతడి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ కేసు నమోదు చేశారు.