పాలకొల్లులో ఘోర రోడ్డు ప్రమాదం

పాలకొల్లులో దిగమర్రు రోడ్డుపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటీని లారీ బలంగా ఢీకొనడంతో ప్రయాణికుడి తల శరీరం నుంచి వేరైంది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే స్థానికులు వెంటపడి వాహనాన్ని ఆపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్