జిన్నూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

పోడూరు మండలం జిన్నూరు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొల్లు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీలో ప్రయాణిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తి గాయపడ్డారు. వీరిలో కర్రే ప్రభావతి, పంతాడ సోమలమ్మ, అంకాడి పుల్లారావు, కొక్కిరిగడ్డ సత్యనారాయణలు ఉన్నారు. గాయపడిన వారిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాలైన సోమలమ్మను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్