యలమంచిలి మండలం పెదలంక, కనకాయలంక గ్రామాల్లో బ్రిడ్జిలకు ఆదివారం,రూ. 23. 64 కోట్లతో మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జిల నిర్మాణంతో లంక గ్రామాలకు శాశ్వతంగా వరద కష్టాలు తీరుతాయని ఆయన హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల పాలనలో రాజధాని ఏదని 10వ తరగతి విద్యార్థిని అడిగితే చెప్పలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.